లక్నో: టీమ్ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అస్వస్థత కారణంగా అతడు సిరీస్ నుంచి తప్పుకున్నట్టు బీసీసీఐ తెలిపింది.
ఇక సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు గాను అక్షర్ స్థానాన్ని బెంగాల్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ భర్తీ చేయనున్నాడు.