హైదరాబాద్, నవంబర్ 11 : ఈవీ కార్ల తయారీ సంస్థ టాటా.ఈవీ.. తెలుగు రాష్ర్టాల్లో భారీగా మెగా చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 14 మెగాచార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంస్థ వోల్ట్రాన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో ఈవీ కార్లను సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చును.
కొత్తగా నెలకొల్పిన వాటిలో హైదరాబాద్లోని ఒకటి, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రెండు, హైదరాబాద్-విజయవాడ హైవేపై మరొకటి, హైదరాబాద్-తిరుపతి హైవేపై మూడు చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. సంస్థకు దేశవ్యాప్తంగా 70కి పైగా చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్నది.