KSCA : తొక్కిసలాట ఘటన కారణంగా చిన్నస్వామి మైదానంలో క్రికెట్ మ్యాచ్‌లు కరువయ్యాయి. కోర్టు కేసు, పోలీసులు అనుమతి నిరాకరిస్తున్న వేళ కర్నాటక క్రికెట్ సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 30న అధ్యక్ష పదవితో పాటు పలు పోస్ట్‌లకు ఎలక్షన్ నిర్వహించనున్నారు. మసకబారిన కేఎస్‌సీఏకు పూర్వ వైభవం తేస్తానంటున్న మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ వెటరన్ ప్లేయర్‌కు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) మద్దతుగా నిలుస్తున్నాడు. దాంతో.. ఎన్నికల్లో విజయంపై దీమాగా ఉన్నాడు వెంకటేశ్ ప్రసాద్.
కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రఘురామ్ భట్ నేతృత్వంలోని సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 30న ముగిసిందిది. కొత్త టీమ్ కోసం నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నస్వామి స్టేడియం చిక్కుల్లో పడిందంటున్న వెంకటేశ్ ప్రసాద్ తాము పగ్గాలు చేపడితే సుపరిపాలన అందిస్తుందని హామీ ఇస్తున్నాడు.
టీమిండియా తొలితరం పేసర్లలో ఒకడైన ఆయన చిన్నస్వామి ఇమేజ్ పెంచుతానని మాట ఇస్తున్నాడు.
VIDEO | Former Indian fast bowler Venkatesh Prasad (@venkateshprasad) is contesting for the post of President in KSCA election set to happen on November 30.
He says, “First of all, we are focussing on getting back international matches, for that we need to liaise with the… pic.twitter.com/S2oiDspHFN
— Press Trust of India (@PTI_News) November 11, 2025
వెంకటేశ్‌కు మద్దతు పలికిన కుంబ్లే మాట్లాడుతూ… ‘కర్నాటక క్రికెట్ సంఘంలో, కర్నాటక క్రికెట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వెంటకేశ్ ప్రసాద్‌కు నేను మద్దతు పలుకుతున్నా. ఈ ఎలక్షన్లో ఆయన టీమ్ కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నాడు. మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ కూడా తాను ప్రసాద్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పాడు.
VIDEO | Former Indian captain Anil Kumble (@anilkumble1074) is supporting former Indian fast bowler Venkatesh Prasad for the post of President in KSCA election set to happen on November 30.
Anil Kumble says, “We feel that the infrastructure in KSCA, also cricket in KSCA need… pic.twitter.com/uD1xY478uo
— Press Trust of India (@PTI_News) November 11, 2025
గతంలో (2013-16) నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వెంకటేశ్ ప్రసాద్ ఈసారి కేసీఏ చీఫ్‌గా సుపరిపాలన, పారదర్శకత అందించాలని భావిస్తున్నాడు. ‘చిన్నస్వామి స్టేడియం క్రికెట్ మ్యాచ్‌లకు ఒక అద్భుతమైన చోటు. దాదాపు 50 ఏళ్లుగా ఈ మైదానంలో ఎన్నో రసవత్తర పోరాటాలు జరిగాయి. అలాంటి వేదిక ఇప్పుడు బోసిపోయింది. మ్యాచ్‌ల నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఇన్నేళ్లలో ఒక్కసారి రాలేదు. ఆఖరికి సొంతగడ్డపై జరగాల్సిన మహారాజా టీ20 లీగ్ కూడా ఇతర వేదికలకు తరలిపోయింది. అందుకే.. మేము మళ్లీ ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా కృషి చేస్తాం. మాపై విశ్వాసం ఉంచండి. ఏకసభ్యకమిషన్ లేవనెత్తిన ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారిస్తాం. నేను ఇదివరకూ చెప్పినట్టు ఈ స్టేడియాన్ని 1974లో నిర్మించారు. ప్రస్తుతం 34 వేల నుంచి 35 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే సీటింగ్ సామర్ధ్యం ఉంది. మేము గెలిస్తే.. సీట్ల సంఖ్య పెంచుతాం. మరో 15 వేల వరకూ అంటే.. 50 వేల మంది మ్యాచ్‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తాం’ అని వెంకటేశ్ తెలిపాడు.
Former India cricketer Venkatesh Prasad announced his candidature for the president’s post in the upcoming Karnataka State Cricket Association (KSCA) elections. Prasad received support from stalwarts Anil Kumble and Javagal Srinath, who were present at the announcement event in… pic.twitter.com/ogOEtdjVjC
— Sportstar (@sportstarweb) November 11, 2025
ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ సందర్భంగా జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నిర్వాహకుల అజాగ్రత్తే తొక్కిసలాటకు కారణమైందని మండిపడింది. ఏకసభ్య కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. చిన్నస్వామి స్టేడియం డిజైన్‌లో, నిర్మాణంలో లోపం ఉందని చెప్పింది. పెద్ద మ్యాచ్‌ల నిర్వహణకు ఈ స్టేడియం ఏమాత్రం పనికిరాదని కర్నాటక క్రికెట్ సంఘానికి షాకిచ్చిన విషయం తెలిసిందే.