IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ (Retention) గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంది. ఆ తర్వాత వేలంలో కొనాల్సిన క్రికెటర్ల గురించి కసరత్తు చేస్తారు పది జట్ల యాజమానులు. అయితే.. వేలం ఎక్కడ జరుగనుంది? ఏ తేదీన నిర్వహిస్తారు? అనే విషయాలపై మాత్రం ఉత్కంఠ వీడడం లేదు. గత రెండు సీజన్లకు విదేశాల్లోనే వేలం పాట నిర్వహించారు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారనే వార్తలు వినిస్తున్నాయి. అలానే తేదీలపై కూడా సందిగ్ధం కొనసాగుతోంది.
ఐపీఎల్ 19వ సీజన్ వేలంను డిసెంబర్ 15న లేదంటే డిసెంబర్ 19న నిర్వహిస్తామని ఇదివరకే నిర్వాహకులు చెప్పారు. ఇప్పుడు మాత్రం ఈ తేదీలు మారేలా ఉన్నాయి. డిసెంబర్ 1న లేదా డిసెంబర్ 16న ఆక్షన్ ఉంటుందని సమాచారం. ఊహించినట్టుగానే ఈసారి కూడా గల్ఫ్ దేశాల్లోనే వేలం ఉండనుంది.
IPL Auction will be happening in overseas for the third consecutive year. 🏏#Cricket #IPL #BCCI #Sportskeeda pic.twitter.com/9bbtoSGUb7
— Sportskeeda (@Sportskeeda) November 11, 2025
పదిహేడో సీజన్ వేలం దుబాయ్‌లో, 18వ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగాయి. 19వ సీజన్ మినీ వేలం అబుధాబీలో నిర్వహిస్తారని టాక్. ఈ వేదికను ఖరారు చేసినట్టు ఫ్రాంచైజీలకు నిర్వాహకులు చెప్పారని తెలుస్తోంది. అయితే.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ లేదా బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అంటున్నాయి సన్నిహిత వర్గాలు. నవంబర్ 15 సాయంత్ర వరకూ రిటెన్షన్ జాబితాను ఫ్రాంచైజీలు ఇచ్చేస్తాయి. దాంతో.. ఏ ఫ్రాంచైజీ ఎవరిని రీటైన్ చేసుంది? వేలంలో నిలిచేది ఎవరు? అనేది ఆరోజే తెలియనుంది.
The IPL mini-auction is reportedly set to be held on December 15 or 16 in Abu Dhabi.#IPLAuction #IPL2026 pic.twitter.com/KjJXY6hP0y
— Circle of Cricket (@circleofcricket) November 10, 2025
ఐపీఎల్ వేలంలో వస్తుందంటే చాలు రికార్డు ధర పలికేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఫ్రాంచైజీలు కూడా ప్రతిభావంతులపై కోట్లు కుమ్మరించేందుకు వెనుకాడవు. గత సీజన్లో రిషభ్ పంత్ (Rishabh Pant) రూ.27 కోట్లతో అత్యధిక ధర పలుకగా.. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్, అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ కొనగా.. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టిపెట్టుకుంది.