Sumit Nagal | భారత నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్‌ను.. వీసా ఇప్పించరూ..!
Sumit Nagal : భారత నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ (Sumit Nagal)కు వీసా కష్టాలు వచ్చిపడ్డాయి. ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) ప్లే ఆఫ్స్ ఆడేందుకు సిద్దమైన అతడికి వీసా మంజూరు కాలేదు.
Sumit Nagal : భారత నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ (Sumit Nagal)కు వీసా కష్టాలు వచ్చిపడ్డాయి. ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) ప్లే ఆఫ్స్ ఆడేందుకు సిద్దమైన అతడికి వీసా మంజూరు కాలేదు. చైనా ప్రభుత్వం అతడి వీసాను నిరాకరించింది. దాంతో.. తనకు వీసా ఇప్పించాలని భారత్‌లోని చైనా దౌత్యాధికారిని, చైనా రాయబార కార్యాలయాన్ని కోరాడు నగాల్. మంగళవారం ఎక్స్ వేదికగా అతడు దౌత్యాధికారులను అభ్యర్థించాడు.
‘గౌరవనీయులైన చైనా అంబాసిడర్.. నా పేరు సుమిత్ నగాల్. భారత నంబర్ 1 టెన్నిస్ ఆటగాడిని. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్లే ఆఫ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేను త్వరలోనే చైనాకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఏ కారణం లేకుండానే నా వీసాను నిరాకరించారు. మీరు త్వరగా స్పందించి సాయం చేస్తే నాకు ఎంతో మేలు చేసినవారవుతారు’ అని నగాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
[URGENT]
Respected @China_Amb_India and @ChinaSpox_India
I am Sumit Nagal, India’s No.1 Tennis player
I am supposed to fly to China soon to represent India at the Australian Open Playoff. But my visa was rejected without reason
Your urgent help would be much appreciated 🙏🏽
— Sumit Nagal (@nagalsumit) November 11, 2025
ఆస్ట్రేలియా ఓపెన్ ఆసియా ఫసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్స్‌లో నగాల్ ఆడాల్సి ఉంది. నవంబర్ 24 నుంచి నవంబర్ 29 వరకూ చైనాలోని ఛెంగ్డూలో ఈ టోర్నీ జరుగనుంది. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిస్తే వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నగాల్ అర్హత సాధించే అవకాశముంది. అందుకే అతడు ఈటోర్నీకి పక్కాగా సిద్దమయ్యాడు. కానీ, చైనా అధికారులు అతడికి వీసా ఖరారు చేయలేదు. వీసాను తిరస్కరించడానికి కారణం కూడా చెప్పలేదు.దాంతో.. టోర్నీకి ఇంకా పది రోజులే ఉండడంతో నగాల్ చివరి ప్రయత్నంగా తనకు సాయం చేయాలని చైనా రాయబారులను అభ్యర్థించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

