మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 25, 2020 , T01:05

సత్తాచాటిన తరుణ్‌ కోన

 సత్తాచాటిన తరుణ్‌ కోన

హైదరాబాద్‌: ఉగాండా ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో యువ షట్లర్‌ తరుణ్‌ కోన సత్తాచాటాడు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో తరుణ్‌-శివమ్‌ ద్వయం 21-15, 22-20తో టాప్‌సీడ్‌ జోడీ గోడ్విన్‌, జువోన్‌పై విజయం సాధించింది. వరుసగా రెండు గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేస్తూ టైటిల్‌ను దక్కించుకుంది. ఇదే జోరులో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో తరుణ్‌, మేఘన జోడీ  21-7, 14-21, 21-16తో భారత్‌కే చెందిన పూర్వీషా రామ్‌, శివమ్‌ శర్మ జంటపై గెలిచింది. 


logo
>>>>>>