న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్'(టాప్స్) జాబితా విడుదలైంది. డోపింగ్‌లో పట్టుబడ్డ యువ రెజ్లర్ రితికా హుడాపై వేటు వేసిన క్రీడాశాఖ ఈసారి కాంపౌండ్ ఆర్చర్లకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
2028 లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని 118 మందితో టాప్ స్కీమ్ ప్లేయర్లను ప్రకటించింది. గతేడాది వివిధ టోర్నీల్లో ప్లేయర్ల ప్రదర్శనను ఆధారంగా చేసుకుంటూ 61 మంది పారా అథ్లెట్లకు తోడు 57 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. కాంపౌండ్ ఆర్చరీలో ఈసారి దీపికాకుమారి, ధీరజ్, అంకితాభక్త్ చోటు దక్కించుకున్నారు.