కింగ్స్టన్: టీ20 వరల్డ్‌కప్(T20 world cup)లో బంగ్లాదేశ్.. సూపర్-8 స్టేజ్‌లోకి వెళ్లింది. ఫైనల్ లీగ్ గేమ్‌లో నేపాల్‌పై 21 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత నేపాలీ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను నియంత్రించడంలో సక్సెస్ అయ్యారు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు దాదాపు షాక్ ఇచ్చిన నేపాలీ బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ బంగ్లాను కట్టడి చేశారు. బంగ్లాదేశ్ కేవలం 106 రన్స్ చేసి ఆలౌటైంది. అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి నేపాల్ చేతులెత్తేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి కేవలం 85 రన్స్ కే ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తంజిమ, ముస్తఫిజుర్ చెలరేగిపోయారు. తంజిమ్ హసన్ తన కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్‌ను ప్రదర్శించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 7 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతను 21 డాట్ బాల్స్ వేశాడు. మరో బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కూడా నేపాలీ బ్యాటర్లను తిప్పలుపెట్టాడు. 4 ఓవర్లలో ఏడు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడతను. నేపాల్ ఓ దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బ్యాటర్ కుషాల్ మల్లా, దీపేంద్ర సింగ్‌లు 52 రన్స్ జోడించారు. కుషాల్ 27, దీపేంద్ర 25 రన్స్ చేశారు.
Bangladesh through to the Super Eights at #T20WorldCup 2024 🔥#T20WorldCup | #BANvNEP | 📝 https://t.co/SeL9yUJSIo pic.twitter.com/e6wtB0SuJT
— T20 World Cup (@T20WorldCup) June 17, 2024