Asia Cup 2023 : ఆసియా కప్లో చివరిదైన సూపర్ 4 మ్యాచ్లో భారత జట్టు(Team India)కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటయ్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ షకిబ్(Tanzim Hasan Sakib) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో హిట్మ్యాన్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, ఇండియా 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వన్డేల్లో తంజిమ్కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం శుభ్మన్ గిల్(9), తిలక్ వర్మ(1) ఆడుతున్నారు. 2 ఓవర్లకు భారత్ స్కోర్.. 13-1.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న నామమాత్రమైన మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. దాంతో, బంగ్లా 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టన్ షకిబుల్ హసన్(80), తౌహిద్ హృదోయ్(54) అర్ధ శతకాలతో అదుకోగా.. చివర్లో వచ్చిన నసుమ్ అహ్మద్(44) దంచి కొట్టాడు. దాంతో, బంగ్లా పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే 3 వికెట్లతో రాణించాడు.