PKL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 29-44 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది.
టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్(10) వరుసగా రెండో సారి సూపర్-10 సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. పవన్‌కు తోడు విజయ్ మాలిక్(9) పోరాటం టైటాన్స్‌కు కలిసి రాలేదు. నరేందర్ ఖండోలా, సచిన్ సూపర్-10 ప్రదర్శనలతో తమిళ్ తలైవాస్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరీ పల్టాన్……తేడాతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది.