T20 World Cup | టీ20 ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శనతో భారత టీ20 జట్టు సారధిగా తన కెరీర్ ముగించిన విరాట్ కోహ్లీకి మరో చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ టీ20 బ్యాట్స్మెన్ జాబితాలో అతను నాలుగు స్థానాలు కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశ ముగిసిన తర్వాత అంతర్జాతీయ ర్యాంకుల్లో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో కోహ్లీ స్థానం కూడా ఒకటి.
టోర్నీ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ టీ20 బ్యాట్స్మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ.. లీగ్ దశ ముగిసే సరికి 8వ స్థానానికి పడిపోయాడు. పొట్టి ప్రపంచకప్లో మూడు ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ 68 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో పాకిస్థాన్ మ్యాచ్లోనే 57 పరుగులు చేశాడు.
అంటే మిగతా రెండు ఇన్నింగ్సుల్లో అతను చేసిన పరుగులు కేవలం 11 మాత్రమే. న్యూజల్యాండ్పై 9 పరుగులు మాత్రమే చేసిన అతను స్కాట్లాండ్తో మ్యాచ్లో 2 పరుగులు చేశాడు. అప్పటికి మ్యాచ్లో భారత్ విజయం సాధించేసింది. ఈ క్రమంలో అతని ర్యాంకింగ్ తీవ్రంగా ప్రభావితమైంది.
ఇదే సమయంలో తొలి రెండు మ్యాచ్లు మినహా మిగతా మ్యాచుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓపెనర్ ద్వయం కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. రాహుల్ అయితే ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున టాప్ స్కోరర్ రాహులే కావడం గమనార్హం.
రోహిత్ కూడా రెండు స్థానాలు మెరుగు పరచుకొని 15వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా విజయాల్లో కీలకమైన పాత్ర పోషించిన ఎయిడెన్ మార్క్రమ్, వాన్ డర్ డస్సెన్ జోడీ తమ స్థానాలను బాగా మెరుగు పరచుకుంది. తాజా ర్యాంకింగ్స్లో మార్క్రమ్ మూడు స్థానాలు మెరుగై 3వ స్థానం చేరగా, వాన్ డర్ డస్సెన్ ఆరు స్థానాలు మెరుగై 10వ స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లిష్ ఆటగాడు డేవిడ్ మలన్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో ఒక్క టీమిండియా బౌలర్ కూడా టాప్-10లో స్థానం సంపాదించుకోలేకపోయాడు.
టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించిన శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో కూడా టాప్-10లో ఒక్క భారత ఆటగాడు కూడా లేడు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు సారధి మొహమ్మద్ నబీ తొలి స్థానంలో ఉన్నాడు.
After a strong #T20WorldCup campaign, Aiden Markram continues his climb 🧗♂️
— ICC (@ICC) November 10, 2021
Plenty of movement in the @MRFWorldwide T20I player rankings 👉 https://t.co/vJD0IY4JPU pic.twitter.com/Y7tTwgdvPM