పెర్త్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్ఇండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై గెలుపొందిన రోహిత్ సేన.. నేడు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ అవకాశాలను సుస్థిరం చేసుకోవాలని టీమ్ఇండియా అనుకుంటున్నది. అయితే ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడే అవకాశం ఉంది.
పెర్త్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడే అవకాశాలు 50 శాతం ఉన్నాయని తెలిపింది. గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని పేర్కొన్నది. ఇది 45 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పింది.
Australia's Bureau of Meteorology predicts partly cloudy skies and a medium (50%) chance of showers, most likely during this afternoon and early evening in #Perth today.
Team India will take on South Africa in the T20 World Cup match at Perth stadium today.
— ANI (@ANI) October 30, 2022