T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న వుమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జులై 5న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనున్నది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం ప్రకటించింది. ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటాయి. జూన్ 12 నుంచి మొదలయ్యే వుమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 33 మ్యాచులు జరుగనున్నాయి. 2017 వుమెన్స్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సైతం లార్డ్స్‌లో జరిగింది. టీ20 ప్రపంచకప్ మ్యాచులు ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, ఓవల్, హాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్లలో జరుగనున్నాయి. టోర్నమెంట్‌లోని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ రౌండ్ మ్యాచ్‌ల తర్వాత నాకౌట్ మ్యాచులు జరుగుతాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో సహా ఎనిమిది జట్లు అర్హత టీ20 ప్రపంచకప్‌కి అర్హత సాధించాయి. మిగతా నాలుగు జట్లకు క్వాలిఫైయర్ పోటీలు నిర్వహించనున్నారు.
ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ అన్ని జట్లకు బ్రిటన్‌లో అభిమానుల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. 2017లో లార్డ్స్‌లో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో స్టేడియం కిక్కిరిసిపోయిందని.. ఫైనల్‌కు ఇంతకంటే మంచి వేదిక లేదన్నారు. టోర్నమెంట్‌కు సిద్ధమవడంపైనే దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2020 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌ను చూసేందుకు మెల్బోర్న్లో రికార్డు స్థాయిలో 86,174 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆ తర్వాత కేప్ టౌన్ (2023), దుబాయి (2024) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచుల సమయంలోనూ స్టేడియాలు ప్రేక్షకులతో నిండిపోయాయి. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ మహిళల జట్టు కెప్టెన్‌గా నాట్ సివర్ బ్రంట్‌ను ఎంపిక చేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో నాట్ సివర్ ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగింది. హీథర్ నైట్ స్థానంలో మహిళల ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. తొమ్మిది సంవత్సరాలు జట్టు కెప్టెన్‌గా కొనసాగింది.
IPL 2025 | పంజాబ్ కింగ్స్‌కు షాక్.. మిగతా మ్యాచులకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..