IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ జట్టు రాణిస్తున్నది. చెన్నైతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. అయితే, ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. వేలు ఫ్యాక్చర్ కావడంతో మిగతా మ్యాచులు ఆడడం కష్టంగా మారింది. మరో ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఏడు పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆటగాడు అవుట్ అయ్యాడు. చెన్నైతో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ స్థానంలో సూర్యన్ష్ షెడ్గే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టోయినిస్ ‘జియోస్టార్’తో మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మాక్స్వెల్ వేలు విరిగిందని.. గాయం అంత తీవ్రంగా ఉంటుందని అతను అనుకోలేదని తెలిపాడు. మ్యాక్స్‌వెల్‌కి స్కాన్ చేసినట్లు తెలిపాడు.
ఇకపై టోర్నీకి అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ను మ్యాక్స్‌వెల్ గాయంపై ప్రశ్నించగా.. అతని స్థానంలో ఎవరికి ఎంపిక చేయవచ్చో ఆలోచిస్తామని చెప్పాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. అజ్మతుల్లా, ఆరోన్ హార్డీ, ఆడని జేవియర్ బార్ట్లెట్ ఉన్నారన్నారు. పరిస్థితిని బట్టి జట్టు కూర్పు ఉంటుందని తెలిపాడు. ధర్మశాలలో జరిగే మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. అంతర్జాతీయ లీగ్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను నేరుగా తీసుకోవడం అంత సులభం కాదని.. భారతీయ యువ ఆటగాళ్ల ప్రతిభను పరిశీలిస్తున్నామని.. కొందరు ఆటగాళ్లు ధర్మశాలకు వస్తున్నారని చెప్పాడు. ఇందులో ఒకరికి పంజాబ్ కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉందని వివరించాడు.