అబుదాబి: దుబాయ్ వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ ( T20 world cup ) టోర్నీలో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా జట్లు గ్రూప్-1లోని ఆరు జట్లలో భాగంగా ఉన్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్.. నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి గ్రూప్‌లో ఆఖరి స్థానంలో ఉన్నది. ఇక ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి, రెండింట గెలిచి నాలుగు మ్యాచ్ పాయింట్లతో గ్రూప్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నది.