T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి త్వరలోనే ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ఖరారు చేయనుంది. అయితే.. ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారని టాక్. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ చేరితో శ్రీలంకలోని కొలంబోలే టైటిల్ ఫైట్ ఉండనుంది.
వచ్చే ఏడాది ఆరంభంలోనే అభిమానుకు క్రీడా వినోదంలో మునిగితేలనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ వరల్డ్ కప్ జరుగనుంది. గత ఎడిషన్ మాదిరిగానే టోర్నీలో పాల్గొనే 20 జట్లను ‘నాలుగు’ గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ -8కు వెళ్తాయి. వీటిని నాలుగు చొప్పున రెండేసీ గ్రూప్‌లుగా చేస్తారు. ఈ దశలో ఒక్కో గ్రూప్ నుంచి టాప్‌లో ఉన్న రెండు జట్లు సెమీస్‌కు దూసుకెళ్తాయి.
Next year’s men’s T20 World Cup is likely to take place from February 7 to March 8 in India and Sri Lanka, with the final to be held in Ahmedabad or Colombo
Full story: https://t.co/LImYpNQBGU pic.twitter.com/ZdkU91alcs
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2025
మనదేశంలోని ఐదు స్టేడియాల్లో, లంకలోని రెండు మైదానాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో లేదా కొలంబోలో ఫైనల్ నిర్వహిస్తారని సమాచారం. ఒకవేళ పాకిస్థాన్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తే కొలంబోనే వేదికగా ఎంపికవుతుంది. భారత్ 2016, శ్రీలంక 2012లో చివరిసారిగా టీ20 ప్రపంచ కప్ పోటీలకు వేదికయ్యాయి.
ప్రస్తుతానికి 15 జట్లు మాత్రమే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా అడుపెట్టనుండగా.. శ్రీలంక, అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ మాత్రమే క్వాలిఫై అయ్యాయి. ఆఫ్రికా క్వాలిఫయర్, ఆసియా – ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్ ఫలితాల ఆధారంగా మిగిలిన ఐదు స్థానాలు భర్తీ అవుతాయి.