SuryaKumar Yadav : టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్(Westindies)ను చిత్తు చేసిన భారత జట్టు వన్డే సిరీస్‌లోనూ అదరగొట్టింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో కరీబియన్లను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(Sanju Samson) తుది జట్టులో చోటు దక్కించుకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే.. విధ్వంసక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) శాంసన్ జెర్సీతో దర్శనమిచ్చి ప్రేక్షకులను ఒకింత అయోమయానికి గురి చేశాడు.
సంజూ పేరుతో ఉన్న జెర్సీతో సూర్యకుమార్ బౌండ్రీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు ‘శాంసన్ ఎక్కడా?.. శాంసన్ ఎక్కడా?’ అని బిగ్గరగా అరవడంతో.. సూర్య అభిమానుల వైపు తిరిగి తన స్పందన తెలియజేశాడు. రెండు చేతులను హృదయాకారంలో చేసి సంజూ తన గుండెల్లో ఉన్నాడంటూ సైగల ద్వారా వాళ్లకు తెలిపాడు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#SanjuSamson #SuryakumarYadav#INDvWI #WIvsIND
Surya bhaii ne sanju ki yad dila dii
हमारा संजु किधर है ………🥲❤️🫶 pic.twitter.com/qdhHkLjTK0
— ANKIT Ydv Behror (@DhaiyaAnkit) July 27, 2023
దీనిపై అభిమానులు తమదైన శైలిలో పంచ్‌లు పేలుస్తున్నారు. ‘సంజూ స్థానంతో పాటు అతడి జెర్సీ కూడా కొట్టేశావా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నీ ప్రేమకు మేం ఫిదా బ్రో’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. అయితే.. సూర్య కుమార్‌కి కేటాయించిన జెర్సీ సైజ్ సరిపోకపోవడంతో అతను శాంసన్ జెర్సీ వేసుకున్నాడట. అతడి కొత్త జెర్సీ రెండో వన్డే తర్వాత రానుంది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన వాళ్లతో బీసీసీఐ సూర్య జెర్సీని పంపించనుందని సమాచారం.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వన్డేలో సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేన.. శనివారం రెండో వన్డేలో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టడంతో ఈ సారి కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తారా? లేదా? పాత పద్ధతినే కొనసాగిస్తారా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు రెండో వన్డేలోనైనా సంజూను ఆడిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.