Stuart Broad : ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) అరుదైన ఫీట్ సాధంచాడు. ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్(Ashes Series) ఆఖరి టెస్టులో అతను ఈ మైలురాయికి చేరువయ్యాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(47) ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా అతను ఆసీస్‌పై 150 వికెట్లును పూర్తి చేసుకున్నాడు.
బ్రాడ్ పేరు వినగానే.. భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(yuvraj singh) కొట్టిన ఆరు సిక్స్‌లు గుర్తుకొస్తాయి. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో యూవీ ఇంగ్లండ్‌పై రెచ్చిపోయాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్(andrew flintoff) అతడిని రెచ్చగొట్టడంతో తన కోపాన్నంతా బ్రాడ్‌పై చూపించాడు.
Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022
ఏకంగా ఆరు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆ ఘటనను బ్రాడ్ జీవితాంతం మర్చిపోలేడు. ఈ ఏడాది ఫైనల్ చేరిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఆ సంచలన ఇన్నింగ్స్‌కు ఈమధ్యే 15 ఏళ్లు పూర్తియ్యాయి. దాంతో యూవీ తన కొడుకుతో కలిసి మళ్లీ తన ఆరు సిక్సర్ల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.