Rohit Sharma | వరల్డ్ కప్‌లో బుమ్రా ఆడతాడా..? భారత కెప్టెన్ సమాధానం ఇదిగో
Rohit Sharma: వరల్డ్ కప్ షెడ్యూల్(ODI World Cup 2023 Schedule) వచ్చినప్పటి నుంచీ అందరి దృష్టంతా భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పైనే నిలిచింది. మెగా టోర్నీ లోపు యార్కర్ కింగ్ కోలుకునే అవకాశం ఉంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్న బుమ్రా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్(Ireland T20 Series)కు సన్నద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్ జట్టులో బుమ్రా ఉంటాడా? అనే ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర సమాధానం...
Rohit Sharma: వరల్డ్ కప్ షెడ్యూల్(ODI World Cup 2023 Schedule) వచ్చినప్పటి నుంచీ అందరి దృష్టంతా భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పైనే నిలిచింది. మెగా టోర్నీ లోపు యార్కర్ కింగ్ కోలుకునే అవకాశం ఉంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( National Cricket Academy)లో ఉన్న బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్(Ireland T20 Series)కు సన్నద్ధమవుతున్నాడు. దాంతో, బుమ్రా వరల్డ్ కప్ ఆడడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా ఈ స్పీడ్‌స్టర్ వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా? అనే ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర సమాధానం చెప్పాడు.
‘బుమ్రాకు చాలా అనుభవం ఉంది. దీర్ఘకాల గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. అతడికి మేము సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నాం. అంతేకాదు బుమ్రా ఫిట్నెస్ గురించి నేషనల్ క్రికెట్ అకాడమీతో నిత్యం మాట్లాడుతూనే ఉన్నాం. వరల్డ్ కప్ (ODI World Cup)లాంటి మెగా టోర్నీల్లో అనుభవం ఉన్న బుమ్రా లాంటి ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరం’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.
జస్ప్రీత్ బుమ్రా

వెన్నెముక గాయం తిరగబెట్టడంతో నిరుడు టీ20 వరల్డ్ కప్(T20 WC 2022) నుంచి బుమ్రా ఆటకు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకొని వచ్చిన అతను నేసీఏలో కోలుకుంటున్నాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు బౌలింగ్‌లో మునుపటి లయ అందుకునేందుకు నెట్స్‌లో గంటల కొద్దీ శ్రమిస్తున్నాడు.
త్వరలోనే జట్టుపై అంచనా
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న షురూ కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు కలిపి భారత జట్టు 12 మ్యాచ్‌లు ఆడనుంది. దాంతో, ఈ కొద్ది సమయంలోనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నామని రోహిత్ శర్మ వెల్లడించాడు. ’10 నుంచి 12 వన్డేలు ఉన్నందున మేము ఎలా ఆడాలి? ఎవరిని ఆడించాలి? అనే దానిపై ఓ స్పష్టత రానుంది.
రోహిత్ శర్మ

కొంతమందికి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే చాన్స్ రాలేదు. అందుకని వాళ్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, వాళ్ల ప్రదర్శన ఎలా ఉందో అంచనాకు వస్తాం’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. నిన్న జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టుపై 5 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
Japan Open 2023 | సాత్విక్ – చిరాగ్ జోరుకు బ్రేక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
ODI World Cup 2023 | వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆన్లైన్ టికెట్లను అనుమతించం.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బీసీసీఐ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

