ముంబై : ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్ రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ఈ ఇద్దరూ ముంబై తరఫున ఆడనున్నారు. ఈ మేరకు ముంబై ప్రకటించిన 18 మంది జట్టు సభ్యులలో సూర్య, దూబె చోటు దక్కించుకున్నారు.