IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో ఉత్కంఠ పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) వాంఖడేలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆరెంజ్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందిన ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
రెండు టీమ్‌లలోనూ చితక్కొట్టగల హిట్టర్లు ఉండడంతో ఈ పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ మైదానంలో విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీగా ఢీకొననడం ఖాయం. ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ముంబై, హైదరాబాద్ మ్యాచ్‌లో విజేతగా నిలిచేది ఎవరు? గతంలో ఎవరెన్ని మ్యాచ్‌లు గెలుపొందారు? రికార్డు స్కోర్ ఎవరిది? అనే విషయాలపై అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత రికార్డులు చూస్తే.. అత్యధిక స్కోర్ ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) పేరిట ఉంది.
#SuryakumarYadav to #SRH bowlers: “𝙇𝙚𝙫𝙚𝙡 𝙨𝙖𝙗𝙠𝙚 𝙣𝙞𝙠𝙡𝙚𝙣𝙜𝙚…”🏏
Will he help Mumbai complete their revenge against Hyderabad?
📹 | @IPL
📺 | #MIvSRH: LIVE NOW on Star Sports | #IPLOnStar | #RevengeWeekOnStarpic.twitter.com/D6MXVhIUmP
— Star Sports (@StarSportsIndia) May 6, 2024
టీ20 అంటేనే రెచ్చిపోయే ఆడే ఈ మిస్టర్ 360 17వ సీజన్లో సన్‌రైజర్స్‌పై గర్జించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి తర్వాత స్థానంలో కామెరూన్ గ్రీన్ ఉన్నాడు. 2023లో వాంఖడేలో హైదరాబాద్ బౌలర్లను ఉతికారేసిన ఈ ఆల్‌రౌండర్ 47 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. మూడో అత్యధిక స్కోర్ డేవిడ్ వార్నర్(David Warner) నమోదు చేశాడు. 2016లో ఈ డాషింగ్ ఓపెనర్ 50 బంతుల్లో అజేయంగా 90 పరుగులు సాధించాడు.
#DidYouKnow: 12.43% of @davidwarner31‘s runs have come in twos and threes in the IPL 😳
And last night, he ended up with a strike rate of 115.62 without hitting a single four or six. 🙌#OrangeArmy #RiseWithUs pic.twitter.com/NPVGwrEfoL
— SunRisers Hyderabad (@SunRisers) April 28, 2019
ఇరుజట్లు ఇప్పటివరకూ 23 సార్లు ఎదురుపడ్డాయి. అయితే.. ముంబై 13 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా.. సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో గెలుపొందింది. వాంఖడేలో మాత్రం ముంబైదే జోరు. అవును.. ఇక్క ఆడిన 8 మ్యాచుల్లో 6 పర్యాయాలు హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 2019 నుంచి గమనిస్తే ఇరుజట్లు 11 సార్లు ఢీకొనగా.. ముంబై 8 మ్యాచుల్లో జయభేరి మోగించింది. 2022 తర్వాత సన్‌రైజర్స్ పుంజుకున్నా సరే.. 3-2తో ముంబై పైచేయి సాధించింది.
Momentum is gold… and both want it 🔥
A heavyweight clash with points and pride on the line! 💙🧡#TATAIPL | #MIvSRH | @mipaltan | @SunRisers pic.twitter.com/JrMsHTKHvw
— IndianPremierLeague (@IPL) April 17, 2025