బొల్లారం, ఏప్రిల్ 17 : బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ మణికొండ, ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విభాగం అధికారి మధు వొటేరి, రెయిన్ వాటర్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ హాజరయ్యారు.
ఈ వేడుకల్లో భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వంతో పాటు సాంస్కృతిక విలువలపై ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం సమిష్టి ప్రయోజనాలను ప్రోత్సహించాలని సూచించారు. తరతరాలుగా సాంస్కృతిక నిశ్చితార్థాన్ని ప్రోత్సహించే శక్తివంతమైన సాంస్కృతిక కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.