Hyderabad | హైదరాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను వేట కొడవలితో నరికి చంపింది తల్లి. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. హత్యకు గురైన పిల్లల వయసు 7, 5 ఏండ్లు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.