IND Vs SA | కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయానికి భారత జట్టు సందర్శించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జగన్నాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది. ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఉన్నాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భార్య దేవిషా శెట్టితో కలిసి ఆలయానికి చేరుకున్నాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మాన్ గిల్ సహా పలువురు ప్లేయర్స్ ఉన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్లేయర్లు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సేవాయత్‌ల సింహద్వారల వద్ద దీపాలువ వెలిగించి.. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించాలని పూజలు చేశారు. ఈ చాలా రోజుల తర్వాత ఒడిశాలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడం ఉత్సాహంగా ఉందని.. భారత ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించి భారత్‌కు విజయం సాధించి పెట్టాలని ప్రార్థిస్తున్నట్లు ఓ పూజారి తెలిపారు.
టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా ప్రస్తుతం టీ20ల్లో తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా టెస్టుల్లో 2-0 తేడాతో భారత్‌ను ఓడించింది. అయితే, వన్డేల్లో 2-1 తేడాతో భారత్ సిరీస్‌ను నెగ్గింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా రెండు జట్లకు ఉపయోగపడనున్నది. ఈ సిరీస్‌లో యువ ప్లేయర్లు జట్టులోకి తిరిగివచ్చారు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో టీమిండియా బలంగా ఉంది. ఈ సిరీస్ సమయంలోనే ఐపీఎల్ వేలం జరుగనున్నది. ఈ మినీ వేలం దృష్ట్యా డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే సహా పలువురు యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రాణించాలని చూస్తున్నారు.
#WATCH | Puri, Odisha | A priest says, “We are all excited because international cricket has returned to Odisha’s soil after many years… We pray that all the Indian cricket players give their best shot and bring victory to India…” https://t.co/FtvHzLC2eP pic.twitter.com/ucBgblwUqi
— ANI (@ANI) December 9, 2025