దుబాయ్: సుమారు ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్‌తో తంటాలు పడి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టచ్‌లోకి వచ్చిన భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ ర్యాంకుల్లోనూ సత్తాచాటాడు. ఈ సిరీస్‌కు ముందు 12వ ర్యాంకులో ఉన్న మిస్టర్ 360.. వరుసగా రెండు అర్ధ శతకాలు (82*, 57*)తో ఐదు స్థానాలను మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి చేరాడు.