IND vs USA టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్ టీమిండియా(Team India)కు పసికూన అమెరికా(USA) గట్టి సవాల్ విసిరింది. స్వల్ప ఛేదనలో యూఎస్ఏ బౌలర్లు భారత స్టార్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. స్లో పిచ్‌పై కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌండరీలకు బ్రేక్ వేశారు. 31 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిన దశలో.. సూర్యకుమార్ యాదవ్(50 నాటౌట్) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డాడు. వీరోచిత అర్ధ సెంచరీ బాదడు. ఐపీఎల్ హీరో శివం దూబే(37 నాటౌట్) సైతం తన సహజ శైలికి భిన్నంగా ఓపికగా ఆడి జట్టును గెలుపు తోవ తొక్కించారు. దాంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆరు పాయింట్లు సాధించిన రోహిత్ సేన సూపర్ 8కు చేరుకుంది.
వరల్డ్ కప్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా ముందు 110 పరుగుల టార్గెట్.. రోహిత్, కోహ్లీ, పంత్, సూర్య, దూబేలలో ఒక్కరు ఆడినా 10 ఓవర్లలో మ్యాచ్ ఖతం. కానీ, అలా జరుగలేదు. అమెరికా బౌలర్లు అసమానం పోరాటంతో భారత జట్టు విజయాన్ని ఆఖరి ఓవర్ వరకూ తీసుకెళ్లారు. అవును.. అసలే బ్యాటింగ్‌కు అచ్చిరానీ పిచ్‌పై చిన్న టార్గెట్‌ను ఛేదించేందుకు భారత జట్టు అపసోపాలు పడింది. పాకిస్థాన్‌పై చెలరేగిన అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ భారత్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతడు విరాట్ కోహ్లీ(0)ని గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. అనంతరం రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(3)ను ఔట్ చేసి భారత్ ప్రేక్షకులను ముక్కునవేలేసుకునేలా చేశాడు. 10 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో రిషభ్ పంత్(18), సూర్యకుమార్ యాదవ్(50 నాటౌట్) జాగ్రత్తగా ఆడారు.
2️⃣ more points in the 💼 🥳 #TeamIndia seal their third win on the bounce in the #T20WorldCup & qualify for the Super Eights! 👏 👏
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#USAvIND
📸 ICC pic.twitter.com/HLbPZ2rwkB
— BCCI (@BCCI) June 12, 2024
అయితే.. అలీ ఖాన్ లో స్లో యార్కర్‌తో పంత్‌ను బౌల్డ్ చేశాడు. అప్పటికి స్కోర్.. 39/3. ఆ తర్వాత శివం దూబే(37 37 నాటౌట్), సూర్యలు ఎంత ప్రయత్నించినా అమెరికా బౌలర్లు ఒక్క బౌండరీ ఇవ్వలే. అండర్సన్ వేసిన 15వ ఓవర్లో దూబే సిక్సర్ బాది జట్టు స్కోర్ 70 దాటించాడు. ఆ తర్వాత గేర్ మార్చిన సూర్య తన మార్క్ షాట్లతో బౌంబరీలు బాదాడు. అయితే..ఒక్క నిమిషంలోపు కొత్త ఓవర్ వేయలేదనే కారణంతో అంపైర్ బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించడం టీమిండియాకు కలిసొచ్చింది. ఆ తర్వాత అమెరికా జట్టు డీలా పడినట్టు కనిపించింది. 19వఓవర్లో సూర్య అర్ధ సెంచరీకి చేరువవ్వడంతో పాటు రెండు రన్స్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.
పొట్టి వరల్డ్ కప్‌లో భారత పేసర్లు విజృంభించారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(4/9) నిప్పులు చెరగగా.. హార్దిక్ పాండ్యా(2/14) మరోసారి బంతితో మెరిశాడు. దాంతో, బౌన్సీ పిచ్‌పై ఆతిథ్య అమెరికా బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ఒక దశలో100 లోపై చాపచుట్టేలా కనిపించిన యూఎస్ఏను నితీశ్ కుమార్(27), ఓపెనర్ స్టీవెన్ టేలర్(24)లు ఆదుకున్నారు. ఉన్నంత సేపు దూకుడుగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌కు బాటలు వేశారు. సిరాజ్ వేసిన 20వ ఓవర్లో 7 రన్స్ వచ్చాయి. దాంతో, అమెరికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 రన్స్ కొట్టింది.
Innings Break!
Solid bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for @arshdeepsinghh
2⃣ wickets for @hardikpandya7
1⃣ wicket for @akshar2026Stay Tuned as India begin their chase! ⌛️
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #USAvIND pic.twitter.com/jI2K6SuIJ5
— BCCI (@BCCI) June 12, 2024