Ram Temple : అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ నలుమూలల నుంచి వేలాదిమంది బాల రాముడి (Ram Lalla)ని దర్శించుకొని మురిసిపోతున్నారు. హిందువులకు ఆరాధ్యుడైన రాముడి ప్రతి రూపాన్ని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ ఓపెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అయోధ్యకు వెళ్లాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడి రామ్‌లల్లాను దర్శించుకున్నాడు.
బాల రాముడిని చూసి తన్మయం చెందిన లిటిల్ మాస్టర్ ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘నాకు చాలా ఆనందంగా ఉంది. రామ్‌లల్లాను దర్శించుకొనే అవకాశం దక్కినందుకు నా జన్మధన్యమైంది’ అని గవాస్కర్ తెలిపాడు. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో 1983 వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో గవాస్కర్ సభ్యుడు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Former Indian cricketer Sunil Gavaskar reached Ayodhya and visited Shri Ram Janmabhoomi temple
He says, “I felt very good, I am blessed that I got the opportunity to worship Lord Ram Lalla.” pic.twitter.com/skOoKwanhb
— ANI (@ANI) September 26, 2024
తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ స్థాయి బౌలర్లను వణికించిన గవాస్కర్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి చేరిన తొలి ఆటగాడి రికార్డు అతడి పేరిటే ఉంది. బలమైన టెక్నిక్‌తో, షాట్లలో కచ్చితత్వంతో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన అతడు 1987లో ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం గవాస్కర్ కామెంటేటర్‌గా తన మాటల అల్లరితో అభిమానులను అలరిస్తున్నాడు.
వరల్డ్ కప్ ట్రోఫీని మురిపెంగా చూస్తూ..
బాబ్రీ మసీదు కూల్చివేత.. ఆపై కోర్టు కేసు.. ఈ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి రావడంతో అయోధ్యలో రామ మందిరాన్ని ఈ ఏడాది సరికొత్తగా నిర్మించారు. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అయోధ్య పూజారులు రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కర్నాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ నల్లరాతితో బాల రాముడి విగ్రహానికి రూపమిచ్చాడు. ప్రస్తుతం గర్భగుడిలో పూజలందుకుంటున్న రాయ్ లల్లా విగ్రహం 4.24 అడుగుల ఎత్తు, 3 ఫీట్ల వెడల్పు ఉంటుంది.