Aishwarya Rai | ఐశ్వర్య రాయ్ బచ్చన్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ మాజీ విశ్వసుందరి ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. కొద్దిరోజుల కింద ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడించింది. ఆ తర్వాత ఆమెపై కొంత ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ రెడ్డిట్ యాప్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ని డిలీట్ చేసినా.. వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య ఏ అనారోగ్య సమస్యలతో పోరాడుతుందో ప్రస్తావించలేదు. బరువు పెరుగుతోందని.. తగ్గేందుకు డైట్ పాటించడం, ఇతర మందులను తీసుకోలేకపోతున్నట్లుగా పోస్ట్ పేర్కొంది. ఈ క్రమంలో అభద్రతా భావంతో వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులను ఎంచుకుంటుంన్నదని తెలిపింది. పారిస్ ఫ్యాషన్ వీక్-2024లో ఐశ్వర్య రాయ్, అలియా భట్ ఇద్దరు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించారు.
ఫ్యాషన్ గాలాకు వీరిద్దరూ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్లుగా హాజరయ్యారు. బెలూన్ హెమ్ రెడ్ కలర్ డ్రెస్‌లో అందరినీ ఆకట్టుకున్నది. ఐశ్వర్య ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కావాలనే ఎవరైనా తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ సైతం డిలీట్ కావడాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. ఐశ్వర్య రాయ్ తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య ఏ కార్యక్రమానికి వెళ్లినా కూతురు ఆరాధ్యతోనే వెళ్తున్నది. బచ్చన్ ఫ్యామిలీతో కనిపించడం లేదు. దాంతో బచ్చన్ ఫ్యామిలీ ఆమెను పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలోనూ బచ్చన్ ఫ్యామిలీ, ఐశ్వర్య వేర్వేరుగా వచ్చారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నారనే అనుమానాలకు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. విడాకులపై అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ఇద్దరూ స్పందించలేదు.