IND vs AUS :పొట్టి సిరీస్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. గెలవక తప్పని మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టింది. కంగారులు నిర్దేశించిన 187 పరుగుల ఛేదనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(24), తిలక్ వర్మ(2 9)లు దూకుడుగా ఆడారు. నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీసినా ఆసీస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు వాషింగ్టన్ సుందర్(49 నాటౌట్). డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన వాషీ.. జితేశ్ శర్మ(22 నాటౌట్) జతగా ధనాధన్ ఆడి అద్భుత విజయాన్ని అందించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఇరుజట్లు చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి.
ఆసియా కప్ ఛాంపియన్‌గా తొలి టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు విజయంతో సిరీస్‌లో నిలిచింది. రెండో మ్యాచ్‌లో పేస్‌కు పడిపోయిన టీమిండియా ఈసారి పక్కా వ్యూహంతో ఆసీస్‌ను దెబ్బకొట్టింది. విజయంతో సిరీస్‌లో ముందంజ వేయాలనుకున్న ఆతిథ్య జట్టు ఆశలకు చెక్ పెట్టింది.
Game. Set. Done ✅
Washington Sundar (49*) and Jitesh Sharma (22*) guide #TeamIndia to a 5-wicket victory in Hobart. 🙌
Scorecard ▶https://t.co/X5xeZ0LEfC #AUSvIND | @Sundarwashi5 | @jiteshsharma_ pic.twitter.com/gRXlryFeEE
— BCCI (@BCCI) November 2, 2025
మూడో టీ20లో ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(25) సిక్సర్లతో దడ పుట్టించాడు. తొలి ఓవర్లోనే సిక్సర్ల్ బాదిన అభిషేక్.. సీన్ అబాట్ వేసిన రెండో ఓవర్ చివరి మూడు బంతులను 4, 6, 4 గా మలిచాడు. అయితే.. రెండో టీ20లో హేజిల్‌వుడ్ మాదిరిగా నాథన్ ఎల్లిస్(3-36) ఈసారి దెబ్బకొట్టాడు. చితక్కొడుతున్న అభిషేక్‌ను షార్ట్‌పిచ్ బంతితో బోల్తా కొట్టించిన ఎల్లిస్ కాసేపటికే ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్(15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మూడు వికెట్లు పడినా తనదైన షాట్లతో అలరించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(24) టిమ్ డేవిడ్ ఓవర్లో మిడాన్ దిశగా సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
4,6,6 – @Sundarwashi5 is on fire 🔥🔥
Live – https://t.co/7lGDijSY0L #TeamIndia #AUSvIND #3rdT20I pic.twitter.com/SMsO0L31MC
— BCCI (@BCCI) November 2, 2025
ప్రధాన ఆటగాళ్లు ఔటైనా.. తిలక్ వర్మ(29) జతగా అక్షర్ పటేల్(17) ధనాధన్ ఆడాడు. నాలుగో వికెట్‌కు 35 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఎల్లిస్ విడదీశాడు. అయినా సరే.. వాషింగ్టన్ సుందర్(49 నాటౌట్) మాత్రం తడబడకుండా అబాట్ వేసిన 14వ ఓవర్లో రెచ్చిపోయిన అతడు వరుసగా 4, 6, 6 తో 19 రన్స్ పిండుకున్నాడు. కానీ.. ఆ మరుసటి ఓవర్లోనే బార్ట్లెట్ సంధించిన స్లో డెలివరీకి తిలక్ వికెట్ కీపర్‌కు దొరికాడు. జితేశ్ శర్మ(22 నాటౌట్) అండగా మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. 19వ ఓవర్ మూడో బంతికి జితేశ్ బౌండరీ బాదడంతో 5 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 నవంబర్ 6న జరుగనుంది.
టాస్ ఓడి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆరంభంలో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టింది. అర్ష్‌దీప్ సింగ్ (3-35) విజృంభణతో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును టిమ్ డేవిడ్(74), మార్కస్ స్టోయినిస్(64) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. టాపార్డర్ విఫలమైనా జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్న ఈ ఇద్దరూ పెద్ద షాట్లతో విరుచుకపడి స్కోర్ వంద దాటించారు. డేవిడ్ ఔటయ్యాక గేర్ మార్చిన స్టోయినిస్.. మాథ్యూ షార్ట్(26 నాటౌట్) దంచేశాడు. దాంతో.. కంగాఊ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి186 పరుగులు చేసింది.
Innings Break!
Three wickets for Arshdeep Singh, two for Varun Chakaravarthy and one for Shivam Dube as Australia post a total of 186/6 on the board.#TeamIndia chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/7lGDijSY0L #TeamIndia #AUSvIND #3rdT20I pic.twitter.com/LJbro5UFlE
— BCCI (@BCCI) November 2, 2025