సమ్మర్ క్యాంప్‌లు షురూ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వేదికగా జరిగిన ప్రారంభం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఆటలతో సందడిగా మారిన మైదానాలు
హైదరాబాద్, ఆట ప్రతినిధి/ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వేదికగా జరిగిన ప్రారంభం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 25న మొదలైన సమ్మర్ క్యాంప్‌లు వచ్చే నెల 31 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ‘నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఆటలు దోహదపడుతాయి.
చిన్నతనంలోనే పిల్లల్లో ప్రతిభను గుర్తించడం ద్వారా మెరికల్లాగా తీర్చిదిద్దేందుకు అవకాశం లభిస్తుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత కొన్నేండ్లు శిబిరాలకు అవాంతరాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న క్రీడా మైదానాల్లో ఆరు నుంచి 16 ఏండ్ల లోపు పిల్లలకు అత్యుత్తమ శిక్షణ అందించనున్నారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు చేసిన మార్చ్ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సరోజ, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్పోర్ట్స్ అధికారి బాషా, జాయింట్ కమిషనర్ యాదయ్య, గేమ్స్ ఇన్స్పెక్టర్ మాధవి, గన్‌ఫౌండ్రీ, గోషామహల్ కార్పొరేటర్లు సురేఖ, లాల్‌సింగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

