Sumit Nagal : భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నగాల్ (Sumit Nagal ) మరోసారి నిరాశపరిచాడు. నిరుడు పురుషుల సింగిల్స్‌లో అద్భుత విజయాలు సాధించిన అతడు ఏటీపీ ఛాలెంజర్స్(ATP Challengers)లో ఓటమి పాలయ్యాడు. ఆరో సీడ్ అయిన నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ జాఫ్రే బ్లాంచనీక్స్ ధాటికి చేతులెత్తేశాడు. హోరీహోరీగా సాగిన పోరులో వరుస సెట్లలో ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయిన నగాల్ 5-6, 6-7తో మ్యాచ్ చేజార్చుకున్నాడు.
ఫ్రాన్స్ వేదికగా జరుగుతన్న ఏటీపీ ఛాలెంజర్స్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నగాల్ అంచనాలను అందుకోలేకపోయాడు. స్థానిక ఆటగాడు జాఫ్రే చ్లాంచనీక్స్ అతడికి గట్టి పోటీనిచ్చాడు. తొలి సెట్‌ను కొద్దిలో కోల్పోయిన నగాల్ రెండో సెట్లోనూ పట్టుదలగా ఆడాడు.
1. Sumit Nagal vs Geoffrey Blancaneaux- Lyon R1
Sumit Nagal has given some disappointing matches this year. He lacked confidence, and he couldn’t defend his title in Heiibronn this week. Disappointing performance against Pacheco Mendez and defending 64 points this week. pic.twitter.com/XZSJ1O8mlZ— Sabharish G (@g_sabharish) June 9, 2025
ఒకదశలో ఇద్దరూ సర్వ్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. రెండో సెట్ విజేతను టై బ్రేక్ ఆధారంగా నిర్ణయించారు. దాంతో, నగాల్‌కు పరాజయం తప్పలేదు. ఈ సీజన్లో తొలి రౌండ్లోనే భారత స్టార్ వెనుదిరగడం ఇది ఆరోసారి.