అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల ( Teachers ) ఆందోళనలు పెరుగుతున్న దృష్ట్యా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎస్జీటీల బదిలీల (SGTs Tranfers ) అంశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్( Nara Lokesh) కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఎస్జీటీల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ బదులు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపడుతామని వెల్లడించారు.
టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలు మంత్రి లోకేష్‌కు వినతిపత్రం అందించగా వెబ్ కౌన్సిలింగ్కే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. దీంతో ఉపాధ్యాయులు తమ ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీడీపీ కి చెందిన ఎమ్మెల్సీలు నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చి మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నచ్చజెప్పి ఒప్పించారు.