IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్(England) తొలి వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ బెన్ డకెట్(27) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ ఓవర్లో డకెట్ భారీ షాట్ ఆడాడు. కానీ, బంతి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు.
గాల్లోకి లేచిన ఆ బంతిని శుభ్‌మన్ గిల్ పరుగెత్తుతూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో, బెన్ స్టోక్స్ సేన 64 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జాక్ క్రాలే(37), ఓలీ పోప్(2) ఆడుతున్నారు. 20 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 65/1.
Catching game 🔛 point! ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/GnC6gYNaOs
— BCCI (@BCCI) March 7, 2024
టాస్ గెలిచిన కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి స్పెల్‌లోనే బుమ్రా ప్రమాదకరంగా కనిపించినా క్రాలే, డకెట్‌లు అనవసర షాట్లు ఆడలేదు. ఆడపాదడపా బౌండరీలతో స్కోర్ బోర్డును 50 దాటించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ స్పిన్నర్లను దింపాడు. ఊహించినట్టుగానే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే డకెట్‌ను వెనక్కి పంపాడు.