దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) సెమీఫైనల్లో.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 68 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ కొట్టాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై.. స్టీవ్ స్మిత్ చాలా ఓపికగా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ అందించాలన్న దీక్షతో అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో వైపు ఆస్ట్రేలియా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. లబుషేన్, ఇంగ్లిష్ వికెట్లను చేజార్చుకున్నది. ఈ రెండు వికెట్లను జడేజా తీసుకున్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లో జడేజాకు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అతను చేయికి బ్యాండేజీ పెట్టుకుని బౌలింగ్ చేశాడు. దీంతో అంపైర్ ఆ బ్యాండేజీ తీయించాడు. తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది.
🚨Umpire told Ravindra Jadeja to remove the tape from his bowling hands.
👉And then blood started coming out of his hand.
Na man Hopefully Jadeja’s injury is not serious .🤞#INDvsAUS pic.twitter.com/IjbPf8jsv5— अभि 🇮🇳 (@abhi7781_) March 4, 2025