మోడ్రన్ క్రికెట్ గ్రేట్స్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఒకడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్సులు ఆడి ఆస్ట్రేలియాను పలుమార్లు కాపాడాడీ రైట్ హ్యాండెడ్ బ్యాటర్. ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కూడా అదే పని చేశాడు.
8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన స్మిత్.. ఉస్మాన్ ఖవాజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో స్మిత్ చేసిన ఒక పని వివాదాస్పదమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్.. బౌలర్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకున్నాడు.
అదే సమయంలో బౌండరీ లైన్ ఆవల ఒక రోబోటిక్ కెమెరా కదులుతూ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్‌కు ఆ కెమెరాను చూపిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. అది చూసిన కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ‘‘ఆ కెమెరా ఏమీ మిడ్ వికెట్ దగ్గర లేదు. బౌండరీ లైన్ బయట ఉంది. అది అతనికి అంతగా ఎలా కనిపించింది? దాదాపు 100 యార్డ్స్ దూరం ఉంది కదా?’’ అని కామెంటరీ చెప్తున్న రాబ్ కీ ఆశ్చర్యపోయాడు.
అతనితోపాటు కామెంటరీ బాక్సులో ఉన్న ఉరూజ్ ముంతాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా ఎవరూ అలా చేయడం ఇప్పటి వరకూ చూడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం. స్టీవ్ స్మిత్ తన చుట్టూ ఉన్న దాన్ని చాలా స్పష్టంగా చూస్తాడు’’ అని చెప్పింది. నెటిజన్లు కూడా దీనిపై భిన్నాభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు.
The buggy sends its apologies @stevesmith49 🙏🏼 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/CdfAsnY8aQ
— Pakistan Cricket (@TheRealPCB) March 21, 2022