హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ సంఘానికి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ అండగా నిలిచింది. అవసరమైన నూతన క్రీడా పరికరాల కొనుగోలు కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించింది. మంగళవారం ఎల్బీ స్టేడియం వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో అక్షర సహకారంతో కొనుగోలు చేసిన కొత్త సామగ్రిని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, అక్షర స్కూల్స్ సీఈవో మదన్మోహన్రావు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ టోర్నీలతో పాటు ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో రాణించిన లిఫ్టర్లు గణేశ్, లక్ష్మి ప్రసన్న, చైతన్య, అఖిల్, శివకుమార్‌ను ఘనంగా సన్మానించారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్లేయర్ల కోసం వసతి సౌకర్యాలను సాట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని సాట్స్ చైర్మన్ పేర్కొన్నారు.