గువహతి: భారత యువ షట్లర్ సంస్కార్ సారస్వత్ స్వదేశంలో జరిగిన గువహతి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఈ జోధ్‌పూర్ కుర్రాడు.. 21-11, 17-21, 21-13తో భారత్‌కే చెందిన మిథున్ మంజూనాథ్పై గెలిచి తన కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ 100 టైటిల్‌ను గెలుచుకున్నాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో హర్యానా సంచలనం తన్వి శర్మ.. 18-21, 18-21తో టుంగ్ చియొ-టాంగ్ (తైవాన్) చేతిలో పోరాడి ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.