లాహోర్: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రోజుకో ఘటన చోటు చేసుకుంటూనే ఉన్నది. దాదాపు 30 ఏండ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్..ఏర్పాట్ల విషయంలో నవ్వులపాలు అవుతున్నది. శనివారం గడాఫీ స్టేడియంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలో భారత జాతీయ గీతం జనగణమన రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మ్యాచ్కు ముందు జాతీయ గీతాలాపనలో భాగంగా తొలుత ఇంగ్లండ్ది పూర్తి కాగా, ఆ తర్వాత మన జాతీయ గీతం జనగణమన రావడంతో అసలు ఏ జరుగుతుందో అర్థం కాక ప్లేయర్లు అవాక్కయ్యారు. దీనిపై సోషల్మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. పాక్కు భారత్ రాకపోయినా జనగణమన ప్లే అయ్యిదంటూ విమర్శలు కురిపించారు.
ENG vs Australia match mai indian national anthem chala diya vo bhi lahore mai 😭😭😂😂😂 #ENGvsAUS #ChampionsTrophy2025 pic.twitter.com/iOHbe4wj1F
— Manjyot wadhwa (@Manjyot68915803) February 22, 2025