గోవా: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. సోమవారం గోవాలో శ్రీనిధి, చర్చిల్ బ్రదర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో శ్రీనిధి తరఫున డేవిస్ కాస్టెండా(90+12ని) గోల్ చేయగా, పెపె గసామా(29ని) చర్చిల్ బ్రదర్స్‌కు ఏకైక గోల్ అందించాడు. లీగ్‌లో ప్రస్తుతం శ్రీనిధి 27 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నది.