IND vs SL : మూడో వన్డేలో భారత జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. రెండో వన్డే మాదిరిగానే లంక స్పిన్ ఉచ్చు బిగించగా టాపార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు చేరారు. 249 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(35), శుభ్‌మన్ గిల్(6)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ కాసేపటికే రిషభ్ పంత్(6) సైతం వికెట్ పారేసుకున్నాడు. దాంతో, పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
ఆ దశలో ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ(20) దునిత్ వెల్లలగే ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. విరాట్ రివ్యూ తీసుకున్నా లాభం లేకపోయింది. దాంతో 71 పరుగులకే భారత జట్టు 4 కీలక వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్(4), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(2)లు ఆచితూచి ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 73/4. ఇంకా టీమిండియా విజయానికి 176 పరుగులు కావాలి.
Make that four down in 11 overs! Wellalage gets Kohli lbw, Sri Lanka in charge! #SLvIND https://t.co/kwbE24dOzG
— ESPNcricinfo (@ESPNcricinfo) August 7, 2024
ఆఖరిదైన మూడో వన్డేలో భారత బౌలర్లు శ్రీలంకను అద్భుతంగా కట్టడి చేశారు. అరంగేట్ర కుర్రాడు రియాన్ పరాగ్(3/54) సూపర్ స్పెల్‌లో రాణించగా ఆతిథ్య జట్టు రన్స్ చేసింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(94), పథుమ్ నిశాంక(45)లు లంకు శుభారంభమిచ్చినా మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఆఖర్లో కుశాల్ మెండిస్(59), కమింద్ మెండిస్(23 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. దాంతో, శ్రీలంక పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.