Eng vs SL : పొట్టి క్రికెట్లో సంచలనం నమోదైంది. శ్రీలంక మహిళల జట్టు(Srilanka Womens Team) ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం సాధించింది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై లంక మహిళల జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. దాంతో, 14 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈరోజు జరిగిన రెండో టీ20లో కెప్టెన్ చమరి అటపట్టు(55 : 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ శతకంతో రాణిచింది. దాంతో, 8 వికెట్ల తేడాతో లంక చిర్మస్మణీయ విజయం ఖాతాలో వేసుకుంది. అంతేకాదు మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు 2009లో మొదటిసారి టీ20ల్లో తలపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ లంక ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ 14 ఏళ్లలో ఇరుజట్లు 12సార్లు ఎదురుపడ్డాయి. వీటిలో 10సార్లు ఇంగ్లండ్ విజయం సాధించగా రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. 2009 నుంచి కెప్టెన్లు మారినా లంక తలరాత మాత్రం మారలేదు. కానీ, ఈసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన చమరి ఆటపట్టు బృందం రికార్డు విజయంతో చరిత్ర సృష్టించింది.
A stunning half-century from Chamari Athapaththu was instrumental in Sri Lanka securing a historic win over England.
More ➡️ https://t.co/cDmsAHFlYI pic.twitter.com/nFJxyjSKw8
— ICC (@ICC) September 3, 2023
టాస్ గెలిచిన చమరి ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. లంక బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ 103 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో చార్లొట్టె డీన్(Charlotte Dean) 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన చమర 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదింది. దాంతో, స్వల్ప లక్ష్యాన్ని మరో ఆరు ఓవర్లు ఉండగానే శ్రీలంక ఛేదించింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20 సెప్టెంబర్ 6న జరుగనుంది.