US Open 2023 : స్టార్ ఆటగాళ్లు డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev), అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev) యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు. ఈ రోజు జరిగిన మూడో రౌండ్లో మెద్వెదేవ్ సెబాస్టియన్ బేజ్(Sebastian Baez )పై విజయం సాధించాడు. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 6-2, 6-2, 7-6 (8-6)తో గెలుపొందాడు. మెద్వెదేవ్ తర్వాతి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినౌర్(Alex de Minau)తో తలపడనున్నాడు.
మరోవైపు జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ వరుసగా నాలుగోసారి ఈ టోర్నమెంట్లో నాలుగో రౌండ్లో ప్రవేశించాడు. జ్వెరెవ్ 2019, 2020, 2021, 2023లో అతను నాలుగో రౌండ్‌కు చేరాడు. ఆదివారం మోరా హోరీగా జరిగిన మారథాన్ మ్యాచ్‌లో గ్రిగర్ దిమిత్రోవ్‌ను 6-7 (2-7), 7-6 (10-8), 6-1, 6-1తో ఓడించాడు. తర్వాతి మ్యాచ్‌లో అతను అమెరికా సంచలనం జన్నిక్ సిన్నర్‌ను ఢీ కొట్టనున్నాడు.
Alexander Zverev has become a regular in the second week at the #USOpen pic.twitter.com/vnJKLeTmdd
— US Open Tennis (@usopen) September 3, 2023
మహిళల సింగిల్స్‌లో వింబుల్డన్ చాంపియన్(Wimbledon Champion) మార్కెటా ఒండ్రుసోవా(Marketa Vondrousova) అదరగొడుతోంది. జోరు మీదున్న ఆమె నాలుగో రౌండ్లో అడుగు పెట్టింది. లుడ్మిల సమ్సోనోవాను 6-2, 6-1తో చిత్తు చేసింది. తర్వాతి రౌండ్లో ఒండ్రుసోవాకు అమెరికా ప్లేయర్ పీటన్ స్టియర్స్ ఎదురుపడనుంది.