Harmanpreet Kaur | బిగ్‌బాష్ లీగ్‌లో భారత కెప్టెన్ రీ-ఎంట్రీ.. ఏ జట్టు తరఫున ఆడనుందంటే..?
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ స్టార్ బ్యాటర్ త్వరలోనే మహిళల బిగ్‌బాష్ లీగ్(Women's Big Bash League)లో కనిపించనుంది. ఈ ఏడాది హర్మన్‌ప్రీత్ మళ్లీ...
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ స్టార్ బ్యాటర్ త్వరలోనే మహిళల బిగ్‌బాష్ లీగ్(Women’s Big Bash League)లో కనిపించనుంది. ఈ ఏడాది హర్మన్‌ప్రీత్ మళ్లీ మెల్బోర్న్ రెనెగేడ్స్(Melbourne Renegades) తరఫున బరిలోకి దిగినుంది. ఈ విషయాన్ని రెనెగేడ్స్ యాజమాన్యం ఈరోజు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. వెన్నెముక గాయం కారణంగా నిరుడు టోర్నీ నుంచి తప్పుకున్న ఆమె ఈసారి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టింది. 2020-21 సీజన్లో పరుగుల వరద పారించిన ఆమె టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ టోర్నీలో రెనెగేడ్స్ తరఫున 406 పరుగులు సాధించింది. అత్యధిక స్కోర్ 81. అంతేకాదు బౌలింగ్‌లోనూ సత్తా చాటిన హర్మన్‌ప్రీత్ 7.45 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టింది.
RED RED RED ❤️ https://t.co/H3z0Ly2pwK
— Harmanpreet Kaur (@ImHarmanpreet) September 3, 2023
మూడు హాఫ్ సెంచరీలతో..
పొట్టి క్రికెట్లో భారత కెప్టెన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. టీ20 కెరీర్లో.. 248 మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ 5,494 పరుగులు చేసింది. బంతితోనూ రాణించి 59 వికెట్లు తీసింది. బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లోనూ ఈ స్టార్ బ్యాటర్ దుమ్ము రేపింది. మూడు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడింది. 10 మ్యాచుల్లో 281 రన్స్ బాదడమే కాకుండా ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టును చాంపియన్‌గా నిలిపింది.
హర్మన్‌ప్రీత్ కౌర్

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో దురుసుగా ప్రవర్తించినందుకు హర్మన్‌ప్రీత్ భారీ మూల్యం చెల్లించింది. వర్షం కారణంగా రద్దు అయిన మూడో వన్డేలో ఆమె తీరును తప్పుపట్టిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో జరిమానాతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అంతేకాదునాలుగు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది. దాంతో, భారత కెప్టెన్ ఆసియా గేమ్స్(Asiam Games 2023)లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానుంది.
ఇవి కూడా చదవండి
Shaheen Afridi | పాక్ స్పీడ్‌స్టర్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరినీ ఔట్ చేసిన తొలి బౌలర్‌గా ఘనత
Team India | నేడు ప్రపంచకప్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ.. సంజూ శాంసన్ ఔట్!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

