Shaheen Afridi | పాక్ స్పీడ్‌స్టర్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరినీ ఔట్ చేసిన తొలి బౌలర్‌గా ఘనత
Shaheen Afridi : దాయాదుల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ ఆఫ్రీదీ (Shaheen Afridi) మరో రికార్డు సృష్టించాడు. శ్రీలంకలోని పల్లెకెల్ స్టేడియంలో నిప్పులు చెరిగిన షాహీన్ వరుస ఓవర్లలో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4)లను సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. దాంతో, ఒకే ఇన్నింగ్స్‌లో...
Shaheen Afridi : దాయాదుల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi) మరో రికార్డు సృష్టించాడు. శ్రీలంకలోని పల్లెకెల్ స్టేడియంలో నిప్పులు చెరిగిన షాహీన్ వరుస ఓవర్లలో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4)లను సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. దాంతో, ఒకే ఇన్నింగ్స్‌లో విరాట్, రోహిత్‌ను బౌల్డ్ చేసిన తొలి బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన రెండో స్పెల్‌లోనూ ఆఫ్రీదీ బెల్లెట్ లాంటి బంతులతో విరుచుకుపడ్డాడు. అప్పటికే హాఫ్ సెంచరీ బాది జోరు మీదున్న హార్దిక్ పాండ్యా(87), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(14)లను ఔట్ చేసి పాక్‌కు బ్రేక్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఈ ఎడమ చేతివాటం పేసర్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాపై షాహీన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దాంతో, భారత జట్టుపై ఈ ఫీట్ సాధించిన మూడో పాక్ బౌలర్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అందులోనూ రెండు మెయిడెన్ ఓవర్లు ఉండడం గమనార్హం.
The Shaheen Afridi magic was on show in the #AsiaCup2023 clash against India 🪄#INDvPAK pic.twitter.com/P3ijOudIYW
— ICC (@ICC) September 2, 2023
ఇషాన్, పాండ్యా మెరపులతో..
ఒకదశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఇషాన్ కిషన్(82), పాండ్యా ఆదుకున్నారు. పాక్ పేసర్లను ఉతికి ఆరేసిన వీళ్లు తమ మెరపు బ్యాటింగ్‌తో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. అయితే.. చివర్లో యువ పేసర్ నసీం షా, హ్యారీస్ రౌఫ్ చెలరేగడంతో భారత్ 266 పరుగులకే ఆలౌటయ్యింది. కానీ, పాక్ ఇన్నింగ్స్ మొదలవుతుందనగా వర్షం మళ్లీ మొదలైంది. ఎంతసేపటికీ వరుణుడు శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాంతో మ్యాచ్ రిఫరీ ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.
ఇవి కూడా చదవండి
Heath Streak | జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
Asia Cup 2023 | విరాట్ కోసమే మ్యాచ్‌కి వచ్చానన్న పాకిస్థాన్ యువతి.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

