Heath Streak | జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
Heath Streak | జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని హీత్ స్ట్రీక్ భార్య నదినే స్ట్రీక్(Nadine Streak) సోషల్ మీడియాలో వెల్లడించింది.
Heath Streak | జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని హీత్ స్ట్రీక్ భార్య నదినే స్ట్రీక్(Nadine Streak) సోషల్ మీడియాలో వెల్లడించింది.
”ఈ రోజు తెల్లవారుజామున నా జీవితంలో గొప్ప ప్రేమికుడు.. నా అందమైన పిల్లల తండ్రి, తన ఇంటి నుండి దేవదూతలతో వెళ్లాడు. అక్కడ అతను తన చివరి రోజులను గడపాలని కోరుకున్నాడు” అంటూ నదినే స్టీక్ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.
హీత్ స్ట్రీక్ 1993లో జింబాబ్వే క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల పాటు సాగిన తన క్రికెట్ కెరీర్లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టాడు. కాగా జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికి కుడా హీత్ స్ట్రీక్ పేరిటే ఉంది. అలాగే జింబాబ్వే తరఫున టెస్టులు, వన్డేల్లో తొలి 100 వికెట్లు తీసిన బౌలర్ కూడా హీత్ స్ట్రీక్ రికార్డు సృష్టించాడు.
ఇదిలా ఉండగా.. 2021లో హీత్ స్ట్రీక్ పై ఐసీసీ నిషేధం విధించింది. స్ట్రీక్ ఐసీసీ డోపింగ్ మార్గదర్శకాలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఈ నిషేధం విధించింది. ఇక జింబాబ్వేతోపాటు బంగ్లాదేశ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు హీత్ స్ట్రీక్ కోచ్‌గా వ్యవహరించాడు
A heart touching post by Heath Streak's wife.
Condolences to Heath Streak's family and friends. pic.twitter.com/HAk9AezeN8
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

