కొలంబో: తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అంచనాలకు మించి రాణిస్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 247 పరుగులకే ఆలౌట్ చేసిన లంకేయులు.. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తూ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 290 రన్స్ చేశారు.
ప్రస్తుతం ఆ జట్టు 43 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంక ఓపెనర్ పతుమ్ నిస్సంక (146 నాటౌట్) వరుసగా రెండో టెస్టులోనూ శతకం చేసి సత్తాచాటాడు. దినేశ్ చండిమాల్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 202 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదిలాఉండగా ఓవర్ నైట్ స్కోరు 220/8తో రెండో రోజు ఆట ఆరంభించిన బంగ్లా.. మరో 27 రన్స్ మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది.