SL vs BAN : క్రికెట్లో సంచలన విజయాలకు కేరాఫ్ అయిన బంగ్లాదేశ్(Bangladesh) స్వదేశంలో తేలిపోయింది. ఈమధ్య కాలంలో మేటి జట్లపై విజయాలతో చరిత్ర సృష్టించిన బంగ్లా జట్టు శ్రీలంక(Srilanka) చేతిలో చిత్తుగా ఓండింది. వరుసగా రెండో టెస్టులోనూ చతికిలబడింది. లంక పేసర్లు లహిరు కుమార, కమింద్ మెండిస్‌ల ధాటికి 318 రన్స్‌కే ఆలౌటయ్యింది. దాంతో, 192 పరుగుల తేడాతో గెలుపొందిన లంక 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ సిరీస్‌లో సెంచరీలతో రికార్డులు నెలకొల్పిన కమిందు మెండిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక భారీ స్కోర్ కొట్టింది. కుశాల్ మెండిస్(93), కమిందు మెండిస్(92), ధనంజయ డిసిల్వా(70), కరుణరత్నే(86), నిశాన్ మధుశనక(57)లు అర్ధ శతకాలతో చెలరేగారు. ఆ తర్వాత అసిథ ఫెర్నాండో, లహిరు కుమారలు బంగ్లా బ్యాటర్లను వణికించారు. దాంతో, ఆతిథ్య జట్టు 178 పరుగులకే ఆలౌటయ్యింది.
Sri Lanka roll Bangladesh over in the second session.#WTC25 | #BANvSL 📝: https://t.co/5O9BK2x1mG pic.twitter.com/J98GTQwnxn
— ICC (@ICC) April 1, 2024
రెండో ఇన్నింగ్స్‌ను లంక 157 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారీ ఛేదనలో బంగ్లాదేశ్ 318 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు టెస్టుల్లో విజయాలతో లంక డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియాలు వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.