ICC : శ్రీలంక క్రికెటర్ ప్రవీణ్ జయవిక్రమ (Praveen Jayawickrama) ఊహించని చిక్కుల్లో పడ్డాడు. ఈ యువ స్పిన్నర్ మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) కేసులో ఇరుక్కున్నాడు. మూడేండ్ల క్రితం జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (Lanka Premier League)లో ప్రవీణ్ ఫిక్సింగ్‌కు ప్రవీణ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అవినీతి నిరోధక శాఖకు తక్షణమే బదులివ్వాలని ప్రవీణ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదేశించింది.
కానీ లంక స్పిన్నర్ మాత్రం సకాలంలో బదులివ్వలేదు. పైగా తన ఫోన్లోని కొన్ని మేసేజ్‌లను ప్రవీణ్ తొలగించాడు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ అతడికి అల్టిమేటం జారీ చేసింది. ఆగస్టు 14వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ, ఐసీసీ ఆదేశాలను ప్రవీణ్ బేఖాతరు చేశాడు. దాంతో, ఐసీసీ 4 నియమాలను లంక స్పిన్నర్ ఉల్లఘించాడు.
JUST IN: Sri Lankan left-arm spinner Praveen Jayawickrama has been charged with three counts of breaching the ICC’s anti-corruption code pic.twitter.com/YtWscvraGB
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2024
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ప్రవీణ్ 2021లో అరంగేట్రం చేశాడు. అయితే.. లంక జెర్సీతో ఒకే ఏడాది బరిలోకి దిగాడు. ఇప్పటివరకూ ప్రవీణ్ ప్రతి ఫార్మాట్లో ఐదు మ్యాచ్‌లు ఆడాడంతే. పల్లెకెల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై 6-92, 5-86తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదు అరంగేట్రంలోనే టెస్టుల్లో 10 వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రవీణ్ రికార్డు నెలకొల్పాడు.