Niroshan Dickwella : డ్రగ్స్ భూతం క్రికెట్‌ను వీడడం లేదు. డోపింగ్ టెస్టులో దొరికిపోయి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న ఆటగాళ్లు చాలామందే. తాజాగా శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా (Niroshan Dickwella) నిషేధానికి గురయ్యాడు. డోప్ పరీక్షలో విఫలమైన అతడిని శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది.
ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్(LPL) సమయంలో నిరోషన్ డోప్ టెస్టులో దొరికిపోయాడు. అంతర్జాతీయ డోపింగ్ ఏజెన్సీ నియమాలను అతడు ఉల్లంఘించాడు. దాంతో, ఈ వికెట్ కీపర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తదుపరి ప్రకటన చేసేంత వరకు నిరోషన్పై నిషేధం కొనసాగుతుందని శుక్రవారం లంక క్రికెట్ తెలిపింది.
Niroshan Dickwella has been suspended indefinitely by Sri Lanka Cricket after having failed a doping test during the recently concluded Lanka Premier League https://t.co/uQDCd7TTI0 pic.twitter.com/u6bG2AbiM7
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2024
‘నిరోషన్ డిక్వెల్లావై తక్షణమే నిషేధం అమలులోకి రానుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అతడిపై సస్పెష్షన్ అలాగే ఉంటుంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖ నిరోషన్పై ఈ చర్య తీసుకుంది. క్రికెట్‌ను నిషేధిత పదార్ధాల నుంచి దూరంగా ఉంచాలనేది మా ఉద్ధేశం’ అని లంక క్రికెట్ వెల్లడించింది.
ఈమధ్యే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో డిక్వెల్లా గాలె మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు 2023 మార్చిలో దేశం తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు డిక్వెల్లాను ఎంపిక చేశారు. కానీ, అతడు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. శ్రీలంక తరఫున ఈ లెఫ్ట్ హ్యాండర్ టెస్టుల్లో 2,757, వన్డేల్లో 1,604. టీ20ల్లో 480 పరుగులు సాధించాడు.