Srilanka Cricket : శ్రీలంక జట్టు ఇంగ్లండ్ పర్యటన (England Tour)లో మూడు టెస్టుల కోసం సన్నద్ధమవుతోంది. స్వదేశంలో భారత్‌పై వన్డే సిరీస్ గెలుపొందిన లంక అదే జోష్‌ను టెస్టుల్లోనూ చూపాలనే పట్టుదలతో ఉంది. అందుకని హెడ్‌కోచ్ సనత్ జయసూర్యకు సాయంగా బ్యాటింగ్ కోచ్‌ను లంక క్రికెట్ (Srilanka Cricket) నియమించింది. ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బెల్ (Ian Bell)ను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లీష్ పిచ్‌లపై బెన్ స్టోక్స్ బృందాన్ని ఓడించేందుకు లంకకు బెల్ ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి.
మూడేండ్ల క్రితం ఆటకు అల్విదా పలికిన బెల్కు కోచ్‌గా అనుభవం ఉంది. 2021లో అతడు బిగ్‌బాష్ లీగ్ జట్టు అయిన హోబర్డ్ హరికేన్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కౌంటీల్లో డెబ్రిషైర్ టీమ్‌కు బెల్ బ్యాటింగ్ కోచ్‌గా తన సేవలందించాడు. ఈ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్‌లోని యువ క్రికెటర్లలో నైపుణ్యం పెంచే కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంతేకాదు న్యూజిలాండ్ టీమ్ కోచింగ్ స్టాఫ్‌లో సైతం బెల్ పనిచేశాడు. దాంతో, ఇంగ్లండ్‌ను దెబ్బతీయాలంటే ఆ దేశానికి చెందిన బెల్ సాయం అవసరమని లంక భావించింది. అయితే.. శ్రీలంక సెలెక్టర్లు ఈ ఒక్క సిరీస్‌కే బెల్‌ను పరిమితం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Sri Lanka Cricket appointed former England batsman Ian Bell as the ‘Batting Coach’ of the national team for the ongoing tour.https://t.co/CvaM44DSM0 #ENGvSL
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 13, 2024
ఇంగ్లండ్ తరఫున 11 ఏండ్ల కెరీర్లో ఇయాన్ బెల్ 118 టెస్టులు ఆడాడు. మిడిలార్డర్లో విధ్వంసక ఆటగాడిగా పేరొందిన అతడు 22 సెంచరీలు బాదాడు. మొత్తంగా 7,727 పరుగులు సాధించాడు. శ్రీలంక, ఇంగ్లండ్‌ల మధ్య ఆగస్టు 21వ తేదీన మాంచెస్టర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఆగస్టు 29న రెండో టెస్టు లార్డ్స్ (Lords)లో, సెప్టెంబర్ 6న ఓవల్ మైదానంలో మూడో టెస్టు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ కోసం 18మందితో కూడిన స్క్వాడ్‌ను లంక సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు.
🚨 Sri Lanka Test Squad for England Tour Announced 🚨 #ENGvSL pic.twitter.com/elussddz7y
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 7, 2024